Thursday, October 9, 2014

సుప్రీంకోర్టులో జయలలిత బెయిల్ పిటిషన్ దాఖలు


సుప్రీంకోర్టులో జయలలిత బెయిల్ పిటిషన్ దాఖలుజయలలిత
న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నా డిఎంకె అధినేత్రి జయలలిత బెయిలు కోసం  సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆమె తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో బెయిల్ పిటీషన్‌ దాఖలు చేశారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో  బెంగళూరులోని సీబీఐ ప్రత్యేక కోర్టు సెప్టెంబరు 27 శనివారం ఆమెను దోషిగా నిర్ధారిస్తూ, నాలుగేళ్ల జైలు శిక్ష, రూ. 100 కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే.  అదేరోజు ఆమెను బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకు తరలించారు.

 జయలలిత తరపున దాఖలైన బెయిలు పిటీషన్ ను ఈ నెల 7వ తేదీ మంగళవారం  కర్ణాటక  హైకోర్టు తోసిపుచ్చింది. దాంతో  ఆమె తరపు న్యాయవాదులు  సుప్రీం కోర్టులో బెయిలు పిటిషన్‌ దాఖలు చేశారు.

No comments:

Post a Comment