skip to main |
skip to sidebar
ఎస్ఎంఎస్ తో పిలిచి.. కాల్చిపారేశాడు!
మారిస్ విల్లె : వాషింగ్టన్ లోని హైస్కూల్లో శుక్రవారం నాటి కాల్పుల కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడైన విద్యార్థి ముందుగా తన సహచరులకు ఎస్ఎంఎస్ ఇచ్చి, వాళ్లను భోజనానికి పిలిచి.. టేబుల్ వద్దే కాల్చిపారేశాడు.ఈ విషయాన్ని పోలీసు అధికారి టీ ట్రెనరీ తెలిపారు. 15 ఏళ్ల జేలెన్ ఫ్రైబెర్గ్ కాల్పులు జరిపే సమయానికి లంచ్ టేబుల్ వద్ద ఐదుగురు విద్యార్థులున్నారు. వాళ్లను కాల్చేసిన తర్వాత ఫ్రైబెర్గ్ ఆత్మహత్య చేసుకున్నాడు.దర్యాప్తులో భాగంగా అతడి ఎస్ఎంఎస్లు, ఫోన్ రికార్డులు, సోషల్ మీడియా రికార్డులను డిటెక్టివ్ లు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే అసలు ఫ్రైబెర్గ్ ఈ కాల్పులకు ఎందుకు పాల్పడ్డాడనే విషయం మాత్రం ఇంతవరకు ఎవరికీ తెలియలేదు. మంచి ఫుట్ బాల్ ప్లేయర్ అయిన అతడితో ఓ గర్ల్ ఫ్రెండ్ విడిపోయినా కూడా ఎప్పుడూ సంతోషంగానే ఉండేవాడని స్నేహితులు చెప్పారు. శుక్రవారం ఐదుగురు స్నేహితులను భోజనానికి ఆహ్వానించి, కెఫెటేరియాలోకి ఒక హ్యాండ్ గన్ తీసుకెళ్లి వాళ్లను కాల్చేశాడు.
No comments:
Post a Comment