Wednesday, October 29, 2014

భార్యతోపాటు కూతుళ్లను చంపి ఆత్మహత్య

భార్యతోపాటు కూతుళ్లను చంపి ఆత్మహత్య
లండన్:  ఏం కష్టం వచ్చిందో ఏమో ఓ ఎన్నారై తన భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలను చంపేశాడు. అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన లండన్ లోని బ్రాడ్ ఫోర్డ్ లో చోటు చేసుకుంది. ఎన్నారై జితేంద్ర లాడ్ (49) తన భార్య దుష్కా లాడ్ (44) ఇద్దరు టీనేజీ కుమార్తెలు త్రిషా (19), నిషా (17)లతో కలసి బ్రాడ్ ఫోర్డ్ నివసిస్తున్నాడు. సోమవారం రాత్రి జితేంద్ర ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇరుగుపోరుగు వారు వెస్ట్ యార్క్ షైర్ పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు జితేంద్ర నివాసానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. జితేంద్ర ఇంత దారుణానికి పాల్పడటానికి గల కారణాలు అన్వేషించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. పోస్ట్ మార్టం నివేదిక వస్తే కానీ కేసుకు సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని వారు వెల్లడించారు.  కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇరుగుపోరుగు వారిని విచారిస్తున్నారు

No comments:

Post a Comment