Tuesday, October 28, 2014

అచ్చంగా అప్సరసలా..

అచ్చంగా అప్సరసలా..
ఈ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో ఉన్నామె పేరు అప్సరా హాంగ్‌సకులా.. థాయ్‌లాండ్‌కు చెందిన ఈ అందగత్తె 1965లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్నారు. ఆ ఫొటోనే ఇది. ఇప్పుడామెకు 67 ఏళ్లు. తాజాగా మళ్లీ అప్సర వార్తల్లోకి వచ్చారు. ఎందుకో తెలుసా? పక్కఫొటో చూస్తే మీకే తెలుస్తుంది. ఆ ఫొటో కూడా అప్సరదే!!  నిజంగానే అమృతం తాగిందా.. ఆమె వయసు 1965లోనే ఆగిపోయిందా అన్నట్లు ఉన్న ఈ చిత్రం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. 1965లో మిస్ యూనివర్స్‌గా గెలిచిన తర్వాత.. ఆమె చాన్నాళ్లూ మీడియాలో పెద్దగా కనిపించలేదు.

ఇటీవలే ఆమె తాలుకు చిత్రాలు బయటకు వచ్చాయి. చూసినోళ్లందరూ డంగైపోయారు. అప్సర కోట్లు ఖర్చుపెట్టి.. వయసు కనిపించకుండా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందనే వదంతులు వచ్చాయి. అయితే.. దీన్ని ఆమె మేనేజర్ ఖండించారు. తాను తినే తిండి దగ్గర్నుంచి ప్రతి విషయంలోనూ ఆరోగ్యకరమైన విధానాలను పాటించడం ద్వారానే ఆప్సర ఇలా యంగ్‌గా కనిపిస్తున్నారని చెప్పారు. అప్సర థాయ్‌లాండ్‌లో బ్యూటీ క్లీనిక్‌లు, స్పాలు నడుపుతున్నారు.

No comments:

Post a Comment